Thursday 21 July 2016

పండితుల గొడవలు

ఇల్లికాలి ఒకడేస్తుంటే, ఇంకేదోకాలి ఇంకొకడేడ్చాడని.  తిన్నదరక్కపోవడంవల్ల కలిగే పైత్యంవల్ల పెట్టుకొనే గొడవలివన్నీ.

చుట్టూ ఇన్ని గొడవలుంటే ఒక పండితోత్తముడికి భాషాదోషాలు ప్రస్తుతం మానవజాతి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా కనబడ్డాయి. అందుకుగానూ ఒకరినొకరు  victimize చేసుకుంటూ, మిగిలినవారి జాలిని అడుక్కుంటూ (అందులో మళ్ళీ superiorityని ఒలకబోస్తూ...)  పండితోచితమైన పనికిమాలిన శైలిలో ఒకర్నొకరు తిట్టుకుంటూ ఏడ్చుకోవడం, దానిని మిగిలినవారు చోద్యంచూడ్డమేగాక సమర్ధిస్తూ వ్యాఖ్యలు రాయడం. పాతికమంది పండితులు కలిసినా పావుకేజీ తెలివికూడా తయారవదని. వీళ్ళవల్ల కలిగిన న్యూసెన్సే ఎక్కువగానీ, వీళ్లవల్ల ఇంతవరకూ కలిగిన ఉపయోగమేమిటి? 

అందులో అందరికీ సుద్దులుచెప్పే ఒకానొక బహుగొప్ప 'ముచ్చు పండితుడు' గారికి అందరూ చెబితేగానీ ఈ గొడవ అనవసరమన్నది ఎప్పుడూ వెలగదాయె. ఎన్నాళ్ళీ రియాలిటీషోలు బాబూ?